Rajinikanth: మీ మాటలు మనసుని తాకాయి

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. అపూర్వ రాగంగల్(apoorva ragangal) మూవీతో కెరీర్ ను మొదలుపెట్టిన రజినీ, మొదటి మూవీతోనే ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఆయనకు కేవలం ఒక్క భాషలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా అభిమానులున్నారు. ఆగస్ట్ 15కు ఆయన ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు పూర్తిచేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రజినీకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ(Modi), ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) కూడా శుభాకాంక్షలు తెలిపారు. రజినీ సినీ ప్రయాణం ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసిందని, ఆయన చేసిన విభిన్న పాత్రలు అందరికీ చేరువయ్యాయని, రానున్న రోజుల్లో ఆయన మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని ట్వీట్ చేయగా, తానెంతో గౌరవించే లీడర్ నుంచి ఇలాంటి విషెస్ రావడమే తనకు నిజమైన గౌరవమని ధన్యవాదాలు తెలిపారు రజినీ.
ఇదే సందర్భంగా రజినీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. రజినీ సినీ ప్రయాణంలో కొన్ని కోట్ల మందిని తన యాక్టింగ్ తో అలరించారని, తన సినిమాలతో కాకుండా సామాజిక అవగాహన కల్పించారని, సమాజంలోని ఎన్నో సమస్యలపై ఆలోచించేలా చేశారని, ఆయన కృషి గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేయగా, దానికి రజినీ రెస్పాండ్ అవుతూ మీ మాటలు నా మనసుని తాకాయని, మీ లాంటి స్నేహితుల ప్రోత్సాహంతో మరింత మెరుగ్గా రాణిస్తానని రజినీ అన్నారు.
https://x.com/rajinikanth/status/1956576072558170158