Rajendra Prasad: ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది

రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాలు చేసి వాటితో ఆడియన్స్ హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచారు. ఆయన సినిమాల్లో చేసిన ఎన్నో సినిమాలు నిజజీవిత సంఘటనల్లో ప్రతీ ఒక్కరికీ ఏదొక సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని రీసెంట్ గా షష్టిపూర్తి (Shashtipoorthi) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాదే వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో ఎవరికీ రాని అదృష్టం తనకు వచ్చిందని, రియల్ లైఫ్ లో తన ఏజ్ 60 ఏళ్లు దాటాయని, ఈ వయసులో ఎక్కడొచ్చి తన పిల్లలు షష్టిపూర్తి అంటారేమోనని తప్పించుకుంటూ తిరిగానని, కానీ ఈ సినిమాలో ఆ షష్టిపూర్తి తప్పలేదని, సినిమాలో జరిగే షష్టిపూర్తి తనదేనని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. తన కెరీర్లో చేసిన సినిమాల్లో అన్ని రకాలున్నాయన్నారు.
బయట ఏ పెళ్లి జరిగినా తన పెళ్లి పుస్తకం(Pelli Pusthakam) సాంగ్ ఉంటుందని, ఆ నలుగురు(Aa Naluguru) తర్వాత చావు సమయంలో కూడా తన పాటే వినిపించడం మొదలైందని, ఇప్పుడు షష్టిపూర్తి సాంగ్ కూడా వచ్చిందని, ఈ స్పెషల్ సాంగ్ ను ఇళయరాజా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన కీలక పాత్రలో నటించిన షష్టిపూర్తి సినిమా మే 30న రిలీజ్ కానుంది.