భారతదేశపు జీరో షుగర్ మార్కెట్ దప్పిక తీర్చడం కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న పెప్సీ
ఆరోగ్యం పట్ల అత్యంత ఆప్రమప్తతతో వ్యవహరించే వినియోగదారులకు మరింత సానుకూలమైన అవకాశాలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటి సారిగా పెప్సీ ఇప్పుడు తమ జీరో కేలరీ వేరియంట్ పెప్సీ బ్లాక్ కోసం వినూత్నమైన బ్రాండ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నూతన జీరో షుగర్‌తో గరిష్ట రుచి ప్రచారం, రుచి మరియు ఆరోగ్యంల సమతుల్యతను వేడుక చేస్తుంది. ఈ ప్రచారం ద్వారా పెప్సీ యొక్క ప్రతిష్టాత్మకమైన సిండీ క్రాఫోర్డ్ వాణిజ్య ప్రకటనను బాలీవుడ్ దివా జాక్విలిన్ ఫెర్నాండేజ్‌తో పునః సృష్టించారు.
ఈ చిత్రాన్ని ఓ ఏకాంతంగా ఉండేటటువంటి ఓ వింటేజ్ గ్యాస్ స్టేషన్ నేపథ్యంలో తీర్చిదిద్దారు. అక్కడ ఇద్దరు యువకులు తమ ట్యాంక్‌లను ఫిల్ చేసుకుంటుంటారు. ఈ గ్యాస్ స్టేషన్ వద్దకు ఓ అమ్మాయి తన బైక్‌తో వస్తుంది. ఆమె తన బైక్‌ను పార్క్ చేసి హెల్మెట్ తొలగించిన తరువాత ఆ అమ్మాయి జాక్విలిన్ ఫెర్నాండేజ్ అని ఆ యువకుకులకు తెలుస్తుంది. ఆమె కట్ చేయబడిన జీన్స్ షార్ట్స్ తో పాటుగా వైట్ ట్యాంక్ టాప్స్ ధరించి ఉంటుంది. ఈ చిత్రంలో జాక్విలిన్ పెప్సీ బ్లాక్ క్యాన్ నుంచి ఓ గుక్క వేసుకుంటుంది. ఈ యువకులు నోరు ఆవులించి అలా చూస్తూ ఉండిపోతారు. దానితో పాటుగా వారు జాక్విలిన్ అక్కడకు రావడం వల్ల ఈ ఆశ్చర్యానుభూతులను పొందారా లేదంటే నూతన పెప్సీ బ్లాక్ క్యాన్ ను చూసి అలా అయ్యారా అన్నది మీరు ఊహించుకుంటూ ఉంటారు. వారు నూతన పెప్సీ బ్లాక్‌ను చూసి ఆశ్చర్యానుభూతులను పొందారని తరువాత సీన్ వెల్లడిస్తుంది. చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండేటటువంటి ఈ చిత్రం జీరో షుగర్‌తో గరిష్ట రుచి అనే పెప్సీ బ్లాక్ వాగ్ధానం పునరుద్ఘాటించడంతో ముగుస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి సౌమ్య రాథోర్, కేటగిరీ లీడ్, పెప్సీకోలా– పెప్సీకో ఇండియా మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి అనంతర కాలంలో మరింత మంది ప్రజలు షుగర్ ఫ్రీ ప్రత్యామ్నాయాల కోసం చూడటం పెరిగింది. మా వినియోగదారులకు మరింత సానుకూలమైన ఎంపికలను అందించాలనే లక్ష్యంతో, మేము నూతన పెప్సీ బ్లాక్‌ను విడుదల చేయడానికి సిద్ధమయ్యాము. ఇది ఎలాంటి చక్కెర జోడించుకోకుండా అత్యున్నత రుచిని అందిస్తుంది’’ అని అన్నారు.
‘‘మరోమారు అత్యంత అందమైన నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో చేతులు కలపడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రతిష్టాత్మక సిండీ క్రాఫోర్ట్ కమర్షియల్‌ను పునః సృష్టించాలనే మా లక్ష్యంను అత్యంత అందంగా ఆమె తీర్చిదిద్దారు. ఈ ప్రచారం అంతర్జాతీయంగా ఏ విధంగా అయితే సంచలనాలను సృష్టించిందో అదే రీతిలో ఇక్కడ అపూర్వమైన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాము. ఇక్కడ ప్రేక్షకులు దీనిని అభిమానించనున్నారు’’ అని ఆమె మరింతగా జోడించారు.
ఈ నూతన చిత్రం గురించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకమైన పెప్సీ వాణిజ్య ప్రకటనల పట్ల నేనెప్పుడూ అమితాసక్తిని కనబరుస్తూనే ఉంటాను. ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడానికి ఎప్పుడూ ముందే ఉంటాను. కాలాతీతమైన సిండీ క్రాఫోర్ట్ ను పునఃసృష్టించడం నాకు చాలా ప్రత్యేకం. నేటి స్వాగ్ తరం కోసం నేను దానిని తిరిగి తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ అద్భుతంగా సాగింది. నేను ఎలాగైతే అభిమానిస్తున్నానో, అదే రీతిలో నూతన పెప్సీ బ్లాక్ విత్ జీరో క్యాన్ కూడా భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకోనుందనే నమ్మకంతో ఉన్నాను’’ అని అన్నారు.
ఈ నూతన పెప్సీ బ్లాక్, నిరంతరం ఆవిష్కరించాలనే బ్రాండ్ యొక్క నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా విన్నింగ్ విత్ పెప్+ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఈ నూతన పెప్సీ బ్లాక్ టీవీసీని టీవీ, డిజిటల్, ఔట్‌డోర్, సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు. ఈ నూతన మ్యాటీ క్యాన్స్ అన్ని ఆధునిక, సంప్రదాయ రిటైల్ ఔట్లెట్ల ద్వారా భారతదేశ వ్యాప్తంగా లభ్యం కావడంతో పాటుగా సుప్రసిద్ధ ఈ–కామర్స్ వేదికల వద్ద కూడా లభ్యమవుతుంది.






