Peddi: పెద్ది షూటింగ్ పై క్రేజీ అప్డేట్

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) దేవర(devara) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ గ్రాండ్ డెబ్యూ అందుకుంది. ఎన్టీఆర్(NTR) హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవగా, ఆ సినిమా రిలీజవక ముందే రామ్ చరణ్(Ram Charan) సరసన బుచ్చి బాబు(Buchi Babu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది(Peddi) సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొన్నా మధ్య ఫస్ట్ షాట్(Pddhi First Shot)రూపంలో గ్లింప్స్ రిలీజవగా, ఆ గ్లింప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పెద్ది షూటింగ్ ను బుచ్చిబాబు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మొన్నటివరకు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో పెద్ది షూటింగ్ జరగ్గా, నెక్స్ షెడ్యూల్ ఢిల్లీలో జరగనున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే జులై 12 నుంచి జాన్వీ కపూర్ పెద్ది షూటింగ్ లో రీజాయిన్ కానుందని, ఆ టైమ్ లో జాన్వీపై కీలక సీన్స్ తో పాటూ రొమాంటిక్ సన్నివేశాలు, రెండు పాటలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, వీలైనంత త్వరగా ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా ఆగస్టు నాటికి పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. పెద్ది సినిమా మార్చి 27, 2026న రిలీజ్ కానుంది.