Peddi: చికిరి మాత్రమే కాదు, మిగిలినవి కూడా ఆ రేంజ్ లోనే
రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్న బుచ్చిబాబు సాన(buchibabu sana) ఈ అవకాశాన్ని బాగా వాడుకోవాలని డిసైడయ్యాడు. అందుకే పెద్ది(peddi) మూవీకి సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా దాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా చికిరి(chikiri) అనే ఫస్ట్ సింగిల్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ తో కూడా హైలైట్ అయ్యేలా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఆల్రెడీ వచ్చిన చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ అవడగా, రాబోయే పాటలు కూడా అలానే ఉంటాయని అంటున్నారు. చికిరి సాంగ్ లో చరణ్ తన స్టెప్పులతో ఆడియన్స్ ను అలరించగా, ఆ స్టెప్పులు, సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం పెద్దిలో చికిరి సాంగ్ మాత్రమే కాదని, మిగిలిన సాంగ్స్ లో కూడా చరణ్ డ్యాన్సులు అంతకుమించి ఉంటాయని అంటున్నారు. రాబోయే సాంగ్స్ ఒకదాన్ని మించి మరొకటి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాయని, చరణ్ డ్యాన్సులతో పాటూ సాంగ్స్ విజువల్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని యూనిట్ సభ్యులంటున్నారు. జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.






