నాని ఇది నీకు తగునా? ఓ పక్క మనుషులు చచ్చిపోతుంటే షూటింగ్ కావాల్సి వచ్చిందా?

కరోనా వల్ల మరోసారి సినిమా ఇండస్ట్రీకి గట్టి దెబ్బ తగిలింది గత నెలలోనే హీరోలందరూ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు సినిమాలు ఆపేసి ఇంటికే పరిమితం అయ్యారు. కానీ…. హీరో నాని మాత్రం కరోనా తన సెట్ లో కూడా ప్రకంపనలు సృష్టించినా కరోనా గిరోనా జాన్తానై అని షూటింగ్ ను మాత్రం ఆపడానికి ఇష్టపడలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ సమయంలో ఒక్క నాని మాత్రమే షూట్ చేశాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు అన్నీ రద్దు అయిపోయాయి. ఇప్పటికే అగ్ర హీరోల సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడిపోయాయి. ఇక సీనియర్ హీరోల పరిస్థితి గురించి అసలు చెప్పన్నక్కర్లేదు. పైగా నటీనటులు కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి భయపడుతున్నారు. మరోపక్క రోజురోజుకూ కరోనాతో మరణించారు అంటూ వస్తోన్న వార్తలు కూడా ఎక్కువైపోతున్నాయి. అయినా నాని మాత్రం ఇంకా తన సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేస్తూనే వున్నాడట.
ప్రస్తుతం తన మరో సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం సారధి స్టూడియోలో భారీ కోల్ కత్తా సెట్ వేశారు. కాగా ఈ సెట్ లోనే నాని సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ ను చేస్తున్నారు. నాని ఇలా మొండిగా షూటింగ్ చెయ్యడం వల్లే, ఇప్పటికే నాని సినిమా టీంలో చాలామందికి కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక పక్క కోవిడ్ నియమ నిబంధనలు అనుసరించి ఎంత జాగ్రత్తగా షూటింగ్ జరిపినా… ఆ సెట్ లోనే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, కేసులు పెరుగుతున్న నాని మాత్రం షూట్ కి బ్రేక్ ఇవ్వడానికి ఇష్టపడ లేదట. కానీ ఈ రోజు టోటల్ టీం వ్యతిరేకించడం తో షూటింగ్ రద్దు చేసారు. ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న వారిలో దాదాపు ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో సినిమా షూటింగ్ ను ఉన్నట్టు ఉండి రద్దు చేశారు. అయితే కరోనా వ్యాధికి గురైన వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ లు, నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్, అలాగే ఇద్దరు మేకప్ మెన్స్ ఉన్నారు. ఇక వీరిందరి కరోనా ట్రీట్ మెంట్ బాధ్యతను పూర్తిగా నిర్మాతే తీసుకోనున్నారు. ఏది ఏమైనా నాని కారణంగానే ఎనిమిది మందికి కరోనా వచ్చిందని సినిమా జనం వాపోతున్నారు.