Nagarjuna: నా నెక్ట్స్ మూవీ అదే!
కెరీర్ స్టార్టింగ్ నుంచి కొత్తదనాన్ని ప్రయత్నించే టాలీవుడ్ కింగ్ నాగార్జున(nagarjuna) రీసెంట్ గా కుబేర(kuberaa) సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం కూలీ(coolie) సినిమాలో సైమన్(simon) పాత్రలో అందరినీ ఆకట్టుకుంటున్న నాగ్, తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 100వ సినిమా గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
100వ సినిమా కోసం ఎంతో మంది దర్శకులను కలిసి వారు చెప్పిన కథలను విన్న నాగార్జున ఇప్పుడు ఆఖరికి ఓ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నాగ్ ఓకే చెప్పింది తెలుగు డైరెక్టర్ కు కాదు, ఓ తమిళ డైరెక్టర్‌కు. అతనే రా.కార్తీక్(ra.Karthik). ఏడాది క్రితం రా.కార్తీక్ చెప్పిన కథ తనకు నచ్చిందని, గత ఆరేడు నెలలుగా దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని నాగ్ చెప్పారు.
ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, ఈ మూవీ చాలా గ్రాండ్ లెవెల్ లో ఉంటుందని, తన నెక్ట్స్ సినిమా అదేనని, కింగ్100(king100) టైటిల్ తో ఆ సినిమా రూపొందనుందని నాగ్(nag) రీసెంట్ గా ఓ టాక్ షో లో వెల్లడించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా రానుందని, ఈ సినిమా కోసం మేకర్స్ ఓ క్రేజీ లుక్ ను కూడా రెడీ చేశారని, అది కూడా నాగ్ బర్త్ డే రోజునే రానుందని తెలుస్తోంది.







