Mrunal Thakur: బ్లూ శారీలో దివాళీ గ్లో తో మెరిసిపోతున్న సీత

సీతారామం(Sitaramam) సినిమాలో సీతగా నటించి అందరినీ తన నటనతో మెప్పించడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఆ తర్వాత హాయ్ నాన్న(Hi Nanna)తో మరో హిట్ ను అందుకున్న మృణాల్, ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మృణాల్ రాయల్ బ్లూ కలర్ శారీ, దానికి మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ చీరలో మృణాల్ మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు పొగుడుతూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.