Mirai: మిరాయ్ మరోసారి వాయిదా పడుతుందా?

హను మాన్(Hanu Man) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు తేజ సజ్జ(Teja Sajja). అంతేకాదు హనుమాన్ తర్వాత తేజకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ వచ్చి ప్రతీ ఆఫర్ నూ ఒప్పుకోకుండా తేజ ఎంతో జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం తేజ మిరాయ్(Mirai) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) డైరెక్టర్ గా మారాక అతను చేస్తోన్న రెండో సినిమా ఈ మిరాయ్.
ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంది. మిరాయ్ లో తేజ సజ్జతో పాటూ మంచు మనోజ్(Manchu Manoj) కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మిరాయ్ టీజర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్టు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటూ టీజర్ రిలీజ్ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
పోస్టర్ లో రిలీజ్ డేట్ లేదంటే ఆగస్ట్ 1న సినిమా థియేటర్లలోకి వస్తుందా లేదా మరోసారి మిరాయ్ విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. సినిమా కథ విషయానికొస్తే ఈ సినిమా కథ మొత్తం మనోజ్ పాత్ర చుట్టే తిరుగుతుందని, మనోజ్ క్యారెక్టర్ సినిమాలో చాలా వైల్డ్ గా ఉంటుందని, అందుకే మనోజ్ క్యారెక్టర్ ను డైరెక్టర్ చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.