రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు చిత్రంలో హీరోయిన్ మాళవిక మోహనన్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమాపై జనాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. శంకర్ దర్శకత్వం లో వస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మాతగా 50వ చిత్రం అవడం, ఇలా ఎంతో క్రెజి సంతరించుకున్న ఈ మూవీలో తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై ఫిలిం నగర్లో టాక్ మొదలైంది. ప్రెజెంట్ జనం నోళ్ళలో నానుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్- శంకర్ కాంబో మూవీ ఒకటి. ఎప్పుడైతే ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యిందో అప్పటినుంచే అందరి దృష్టి ఇటువైపు పడింది. ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించిన అప్డేట్స్, నటీనటుల వివరాల గురించి వెతుకుతోంది మెగా టీం మరోవైపు ఈ సినిమా గురించి తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుండటం సినిమాపై క్రేజ్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో హీరోయిన్ ఎవరనే దానిపై ఫిలిం నగర్లో టాక్ మొదలైంది.
మొదట ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీని తీసుబోతున్నట్లు టాక్ రాగా.. ఆ తర్వాత రష్మిక మందన, ఆలియా భట్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సినీ వర్గాల నుంచి వస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ ఇద్దరూ కాదని, మరో హీరోయిన్ మాళవిక మోహనన్ పేరుని దాదాపుగా కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. గతంలో విజయ్ హీరోగా వచ్చిన ‘మాస్టర్’ చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే శంకర్ కన్ను ఆమెపై పడిందని టాక్. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ యాభైయోవ చిత్రంగా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అత్యంత స్పెషల్‌గా ఉండాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు భారీ బడ్జెట్ కేటాయించి సినిమా రూపొందించాలని ఆయన ఫిక్సయ్యారట. శంకర్ కూడా అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.