Magic District: AMB శరత్ సిటీ కాపిటల్ మాల్లో అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ ప్రారంభం
▪️ ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్
▪️ సాహసాలను అనుభవించే సరికొత్త ఫార్మాట్
▪️ * సరికొత్త కాన్సెప్ట్ లకు భారీ స్పందన*
కొండాపూర్ లోని AMB మాల్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) ప్రారంభమైంది. ఈ అడ్వెంచర్ జోన్ విశేషాలపై మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు.
AMB మాల్లోని 6వ అంతస్తులో సుమారు 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది కేవలం చూసే వినోదం మాత్రమే కాదు, సందర్శకులు స్వయంగా కథలో పాత్రధారులుగా మారి నడుస్తూ సాహసాలను అనుభవించే సరికొత్త ఫార్మాట్.
నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ ఈ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’కు రూపకల్పన చేశారు. భారతీయుల మేధస్సు, సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 27 విభిన్న కాన్సెప్టులను తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ సృష్టికర్త నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ రంగంలో మాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఇండియాలో మరెక్కడ లేనివిధంగా ప్రపంచస్థాయి సాహసాల అనుభవాలను హైదరాబాద్ ప్రజలకు మేము అందించేందుకు AMB మాల్లోని 6వ అంతస్తులో అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ను 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశాం. భారతీయ ప్రజలకు సరికొత్త సాహసాలను పరిచయం చేసేందుకు మా కూతురు, ఆపరేషన్ మేనేజర్ చందన లిపి అమెరికాలో జాబ్ వదిలేసి వచ్చింది. ఈ ఫేస్ 1 ఇప్పుడు ప్రారంభించాము.” అని అన్నారు.
ఆపరేషన్ డైరెక్టర్ చందన లిపి మాట్లాడుతూ… మొదటి దశలో నాలుగు సాహస ప్రపంచాలను అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రస్తుతం అందుబాటులో 4 రకాల సాహసాల్లో… జోంబీ సిటీ (Zombie City), స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes), స్కేరీ హౌస్ (Scary House), బూ బూ హౌస్ (Boo Boo House) ఉన్నాయి.” అని అన్నారు.
నిర్వాహకుల్లో ఒకరైన కే రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మేము ఏర్పాటు చేసిన సరి కొత్త కాన్సెఫ్ట్ లు ఏర్పాటు చేశాం. రెస్పాన్స్ భారీగా వస్తోంది.” అని చెప్పారు.
మొత్తం ఏడు విభిన్న థీమ్‌లను ప్లాన్ చేయగా, ప్రస్తుతం మొదటి దశలో నాలుగు సాహస ప్రపంచాలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు రకాల సాహసాలను చూస్తే…
* జోంబీ సిటీ (Zombie City): జోంబీలు ఆక్రమించిన నగరం నుంచి ప్రాణాలతో బయటపడటం ఈ అడ్వెంచర్ ముఖ్య ఉద్దేశ్యం.
* స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes): భయంకరమైన వాతావరణంలో చిక్కుకున్నప్పుడు క్లూస్‌ని వెతికి, పజిల్స్ సాల్వ్ చేస్తూ టీమ్ వర్క్‌తో తప్పించుకోవాలి.
* స్కేరీ హౌస్ (Scary House): హార్డ్‌కోర్ హారర్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం లైవ్ ఇంటరాక్షన్లు, భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో దీనిని రూపొందించారు.
* బూ బూ హౌస్ (Boo Boo House): ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించబడింది. పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతూ, నవ్వుతూ ఆడుకునేలా ఇక్కడ స్పూకీ థీమ్స్ ఉంటాయి.
కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పర్యాటకులు అందరికీ ఒక మరపురాని అనుభవాన్ని అందించేలా మ్యాజిక్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది.






