Lokesh Kanagaraj: స్టాండలోన్ ఫిల్మ్ గా రోలెక్స్
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) తీసింది తక్కువ సినిమాలే అయినా భారీ పాపులారిటీని అందుకున్నాడు. మా నగరం(maa nagaram)తో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన లోకేష్, ఖైదీ(Khaidhi) సినిమాతో తన క్రేజ్ ను చాలా పెంచుకున్నాడు. ఖైదీ సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఖైదీ2(Khaidhi2) ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఖైదీ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(Lokesh Cinematic Universe) ను పరిచయం చేసిన లోకేష్, తాను తీసే సినిమాలన్నింటినీ ఒక దాంతో మరో దాన్ని లింక్ చేస్తూ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై హైప్ ను పెంచుతూ వస్తున్న లోకేష్ రీసెంట్ గా కూలీ(Coolie) సినిమాను మాత్రం స్టాండలోన్ ఫిల్మ్ గానే చేశాడు. ఇదిలా ఉంటే కూలీ సినిమా తర్వాత లోకేష్ నెక్ట్స్ మూవీ ఖైదీ2 నే అని తెలుస్తోంది.
లోకేష్ తన నెక్ట్స్ మూవీగా ఖైదీని చేయనున్నాడని, రోలెక్స్ సినిమాను ఒక స్టాండలోన్ సినిమాగా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలను నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఖైదీ2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.







