Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇంట మరో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి (Rukmini) కన్నుమూశారు (Passed away). కోట శ్రీనివాసరావు జులై (July ) 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇకలేరన్న వార్త మరువక ముందే కోట సతీమణి మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు, అందరినీ కలచివేస్తోంది. కోట శ్రీనివాసరావుకు ఓర్పు ఎక్కువని, అందరితోనూ సరదాగా ఉంటారని రుక్మిణి ఓ సందర్భంలో పంచుకున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో అహనా పెళ్లంట అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. కొద్ది రోజుల సమయంలో కోట శ్రీనివాస రావు దంపతులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు రుక్మిణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.







