NC25: కొరటాలతో చైతన్య మూవీ?
మిర్చి(mirchi), శ్రీమంతుడు(srimanthudu), జనతా గ్యారేజ్(janatha garrage) లాంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న కొరటాల శివ(koratala Siva), ఆచార్య(Acharya) సినిమాతో భారీ ఫ్లాపును మూట గట్టుకున్నారు. ఆచార్య సినిమాతో కొరటాలపై చాలా నెగిటివిటీ వచ్చింది. ఆచార్య తర్వాత ఎన్టీఆర్(NTR) తో చేసిన దేవర(Devara) సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ హిట్ ఎన్టీఆర్ ఖాతాలో పడింది. దీంతో దేవర2 తో కొరటాల తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటారని అందరూ భావించారు.
ఈ నేపథ్యంలోనే దేవర2(Devara2) స్క్రిప్ట్ పై కొరటాల భారీ సన్నాహాలు చేస్తున్నారని, స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఓ వార్త అందరినీ షాక్ కు గురి చేస్తుంది. కొరటాల రీసెంట్ గా నాగ చైతన్య(naga chaitanya)ను కలిసి ఓ స్క్రిప్ట్ ను నెరేట్ చేశాడని, కొరటాల చెప్పిన మాస్ డ్రామా చైతన్యకు నచ్చిందని అంటున్నారు.
తండేల్(Thandel) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుని ప్రస్తుతం విరూపాక్ష(Virupaksha) డైరెక్టర్ తో ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటిస్తున్న నాగ చైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ కోసం కొరటాలను సెట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చైతూ మంచి కాంబినేషన్ ను సెట్ చేసుకున్నట్టే అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే దేవర2 పరిస్థితేంటని తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.







