మెగాస్టార్ చిరంజీవిపై కేంద్రమంత్రి… ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బంధం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్విట్ చేశారు. ఆయన ట్వీట్‍కు స్పందించిన చిరంజీవి మీ దయగల మాటలకు ధన్యవాదాలు. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా అంటూ రిఫ్లై ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమంది రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్న నేపథ్యంలో వారి ప్రాణాలను కాపాడేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.