Jaya Krishna: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం

సినీ ఇండస్ట్రీలో వారసత్వానికి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది స్టార్లు వస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోగా ఇప్పుడు మరో కుర్రాడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను మరెవరో కాదు, టాలీవుడ్ గర్వించదగ్గ హీరోల్లో ఒకరైన కృష్ణ(Krishna) మనవడు జయ కృష్ణ(Jaya Krishna).
జయకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు(Ramesh Babu) కొడుకు. త్వరలోనే జయకృష్న టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ జయకృష్ణ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ఉన్నాడని సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ జయకృష్ణను హీరోగా పరిచయం చేయనుండగా, ఓ విజనరీ డైరెక్టర్ అతని డెబ్యూ కోసం మంచి కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మే 31న కృష్ణ జయంతి సందర్భంగా జయకృష్ణ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ ఫోటోల్లో జయ కృష్ణ చాలా చార్మింగ్ గా, ఎంతో డైనమిక్ కనిపిస్తూ అందరినీ ఇంప్రెస్ చేసేలా కనిపిస్తున్నాడు. త్వరలోనే అతని మొదటి సినిమా ఏ డైరెక్టర్ తో చేయనున్నాడు? నిర్మాత ఎవరు అనే విషయాలు వెల్లడి కానున్నాయి. కృష్ణ తర్వాత అతని వారసుడిగా రమేష్ బాబు, మహేష్ బాబు(Mahesh Babu) ఇండస్ట్రీకి పరిచయం కాగా, ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.