Mahesh Babu: మహేష్ అభిమాని ప్రేమకు అందరూ షాక్
సినీ రంగంలో ఉండే వారికి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో అందరికీ తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలకు అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. తమకు ఇష్టమైన హీరోల కోసం ఏం చేయడానికైనా ప్యాన్స్ వెనుకాడరు. ఎంతోమంది హీరోల ఫ్యాన్స్ ఈ కోవలో ఇప్పటికే ఎన్న సార్లు రకరకాలుగా ప్రయత్నించి వార్తల్లో కూడా నిలిచారు.
ఇప్పుడు తాజా సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) ఫ్యాన్ కూడా అలానే చేశాడు. అతని ఫ్యానిజం చూసి సగటు మహేష్ ఫ్యాన్సే ఆశ్చర్యపోయారు. తన అభిమాన హీరో గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదనే ఉద్దేశంతో మహేష్ ఫ్యాన్ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మ్యాటర్ లోకి వెళ్తే మహేష్ కారు పీవీఎన్ఆర్ వే లో ఓవర్ స్పీడ్ వెళ్లడంతో పోలీసులు అతని కారుకి ఫైన్ వేశారు.
గత నెల 4వ తేదీన మరియు గత నెల 17వ తేదీన రెండుసార్లు మహేష్ కారు అయిన TS 36 N 4005 కు పోలీసులు రూ.2070 ఫైన్ విధించారు. అయితే వారణాసి(varanasi) ఈవెంట్ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డిస్కషన్స్ చేస్తుండటం చూసి సహించలేని ఓ ఫ్యాన్ ఆ ఫైన్ ను తన సొంత డబ్బులతో కట్టేసి మహేష్ పై తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నాడు.






