Mrunal Thakur: ట్రైన్ లో నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా

సీరియల్ నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి ఎంటరైంది. సీతారామం(sitaramam) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మృణాల్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న మృణాల్ ఓ దశలో సూసైడ్ చేసుకుందామనుకున్నట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
చిన్నప్పట్నుంచి హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్న మృణాల్ ను ఇండస్ట్రీపై ఉన్న అపోహల కారణంగా తన తల్లిదండ్రులు మొదట ప్రోత్సహించలేదట. దీంతో మృణాల్ త్రీ ఇడియట్స్(3 Idiors) సినిమాను తన పేరెంట్స్ కు చూపించి నటి అయితే ఇలాంటి మంచి పాత్రలు చేసే అవకాశముందని చెప్పి వారిని ఒప్పించిందట. ఇప్పటికీ తన దగ్గరకు వెళ్లే పాత్రలు ముందు తన పేరెంట్స్ కు చెప్పి, వాళ్లు ఒప్పుకుంటేనే తను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పింది మృణాల్.
కొత్త నటుల కోసం సినిమాల్లో ఆడిషన్స్ నిర్వహించేటప్పడు అక్కడికి వెళ్తే సీరియల్ యాక్టర్ అనే భావనతో చులకనగా చూసేవారని, చాలా సార్లు ఆ అవమానం భరించలేక ఏడ్చానని, ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్లి లోకల్ ట్రైన్ లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందామనుకున్నానని, పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయానని మృణాల్ ఠాకూర్ చెప్పింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో అడివి శేష్(adivi sesh) తో కలిసి డెకాయిట్(dacoit) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.