Dragon: ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
ఎన్టీఆర్(NTR) హీరోగా కేజీఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్(dragon). యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్, నీల్ ఇద్దరికీ మాస్ ఇమేజ్ ఉండటంతో పాటూ ఈ సినిమా కూడా యాక్షన్, మాస్ నేపథ్యంలోనే తెరకెక్కుతుండటంతో డ్రాగన్ పై మంచి బజ్ ఉంది.
దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా మేకోవర్ అవడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. తారక్(tarak) కష్టాన్ని గుర్తించిన నీల్ ఈ మూవీని ఎన్టీఆర్ కెరీర్లోనే గొప్పగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలై చాలా కాలమైనప్పటికీ మేకర్స్ నుంచి షూటింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు.
కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. డ్రాగన్ మూవీ కోసం ఓ భారీ అటవీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారని, ఆ సెట్ లో దాదాపు 100 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది. డ్రాగన్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ను సంక్రాంతి పండగ తర్వాత మేకర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే ఈ సినిమాలోని కీలక భాగాల షూటింగ్ ను నీల్ విదేశాల్లో ప్లాన్ చేశాడని తెలుస్తోంది.






