Krish: నా బెస్ట్ వర్క్ అదే!

గమ్యం(gamyam) సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు క్రిష్ జాగర్లమూడి(krish jagarlamudi). ఫస్ట్ సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అందరి దృష్టినీ తన వైపుకి తిప్పుకున్నారు క్రిష్. ఒక కొత్త డైరెక్టర్ నుంచి అంత మంచి సినిమా రావడం చూసి అందరూ ఆ టైమ్ లో ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. ఇప్పటికీ టాలీవుడ్ లోని గొప్ప సినిమాల్లో గమ్యం స్థానం సుస్థిరం.
గమ్యం తర్వాత వేదం(Vedam), కృష్ణం వందే జగద్గురం(Krishnam vande jagadgurum), కంచె(kanche), గౌతమీపుత్ర శాతకర్ణి(Gauthamiputra satakarni) ఇలా ఎన్నో మంచి సినిమాలకు క్రిష్ దర్శకత్వం వహించారు. తాజాగా అనుష్క(anushka) ప్రధాన పాత్రలో చేసిన ఘాటీ సినిమాతో ప్రేక్షకులను అలరించాలని చూస్తున్న క్రిష్, ఘాటీ(Ghaati) ప్రమోషన్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
ఘాటీ ప్రమోషన్స్ లో క్రిష్ ను మీ కెరీర్ బెస్ట్ మూవీ ఏంటని అడిగితే ఎవరూ ఊహించని మూవీ పేరు చెప్పారు. తన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటైన యన్.టి.ఆర్(NTR) పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగా నిలిచినప్పటికీ, ఎమోషనల్ గా ఆ సినిమా తనకు చాలా పెద్ద సవాల్ గా నిలిచిందని, ఎమోషన్స్ విషయంలో ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానని అందుకే ఆ సినిమా తన బెస్ట్ వర్క్ గా అనుకుంటానని క్రిష్ చెప్పారు.