Ghaati: అందుకే అనుష్కను తీసుకున్నా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) తర్వాత అనుష్క(anushka) చాలా గ్యాప్ తీసుకుని ఒప్పుకున్న చిత్రం ఘాటీ(Ghaati). క్రిష్(krish) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ ప్రభు)(vikram prabhu) మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
అనుష్క ప్రమోషన్స్ కు హాజరవకపోవడంతో ఆ భారమంతా దర్శకనిర్మాతలపైనే పడింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ ఈ సినిమాను అనుష్కతోనే ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఘాటీ చాలా సెన్సిటివ్ టాపిక్ అని, అమ్మాయి యాంగిల్ నుంచి కథను చెప్తే అందులో డెప్త్, ఎమోషన్స్ ఆడియన్స్ కు సరిగ్గా రీచ్ అవుతాయనిపించి ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు.
దానికి తోడు అనుష్కతో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, అది ఇప్పటికి కుదిరిందని, ఘాటీలో అనుష్క నట విశ్వరూపం చూస్తారని, అనుష్క యాక్టింగ్ కు ఆడియన్స్ పిచ్చోళ్లైపోతారని, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అని కాకుండా ప్రతీ సీన్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుందని క్రిష్ అన్నారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.