Allu Arjun: ఇప్పటి వరకు నా మైండ్ లోకి రానిది అల్లు అర్జునే!

కరోనాకు ముందు పవన్ కళ్యాణ్(pawan kalyan) తో హరిహర వీరమల్లు(harihara veeramallu) సినిమాను మొదలుపెట్టి ఎంతకీ ఆ సినిమా పూర్తి కాకపోవడం మరియు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(krish jagarlamudi) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(anushka) తో ఘాటీ(Ghaati) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఘాటీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న క్రిష్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. క్రిష్ కెరీర్లో వచ్చిన సినిమాల్లో వేదం(vedam) సినిమాకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. అల్లు అర్జున్(allu arjun), మంచు మనోజ్(manchu manoj), అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ సినిమాలో అనుష్క వేశ్యగా నటించారు. వేశ్యగా నటించినప్పటికీ క్రిష్ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు అందరికీ నచ్చింది.
అయితే తాను ఏ కథ రాసుకున్నా, రాసుకునేటప్పుడే మైండ్ లోకి యాక్టర్లు వచ్చేస్తారని, ఇప్పటివరకు తాను చేసిన అన్ని సినిమాలకూ అంతే జరిగిందని, కానీ అలా మైండ్ లోకి రాని ఒకే ఒక క్యారెక్టర్ అల్లు అర్జున్ అని చెప్పారు క్రిష్. వేదం స్టోరీ విని, కేబుల్ రాజు(cable raju) క్యారెక్టర్ తాను చేస్తానని బన్నీ చెప్పాక ఆయన కోసం కథను మళ్లీ రాశానని, ఆ సినిమాకు అంత రీచ్ రావడంలో మెయిన్ క్రెడిట్ బన్నీదేనని, ఆ తర్వాత ఆర్కా మీడియా(arka media) వాళ్లు వేదం కథను బాగా నమ్మారని అన్నారు క్రిష్.