Dakshina Kaali: వైభవంగా జరిగిన దక్షిణ కాళీ ప్రీ రిలీజ్ ఈవెంట్
విలన్ గా అఫ్సర్ ఆజాద్ రోరింగ్ ఫెర్ఫార్మెన్ తో రాబోతున్న దక్షిణ కాళి
సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “దక్షిణ కాళీ”. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ – అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పాలి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కు మా మూవీ షోస్ వేస్తున్నాం. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి మంచి కథను అందించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సత్యవాణి గారు నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా మూవీ ఉంటుంది. అన్నారు.
నిర్మాత సత్యవాణి మీసాల మాట్లాడుతూ – అమ్మవారి భక్తురాలిని నేను. ఆమే నాతో ఈ సినిమా నిర్మింపజేసిందని నమ్ముతున్నా. ఈ మూవీకి ప్రతి ఒక్కటీ అనుకున్నట్లుగా కుదిరాయి. అవన్నీ అమ్మవారి దయ వల్లే జరిగాయని నమ్ముతాను. ఆమె మహిమలు చెప్పేందుకు మేము ఎంతటివారం. ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దారు మా డైరెక్టర్ తోట కృష్ణ. అలాగే సుబ్బు, ప్రియాంక, ఆజాద్ బాగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడలో త్వరలో మా చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అన్నారు.
హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ – ఈ సినిమాకు రియల్ హీరో మా ప్రొడ్యూసర్ సత్యవాణి గారు. ఆమె ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమాను నిర్మించారు. మేము సెట్ కు వచ్చి నటించి వెళ్లిపోతాం. కానీ నిర్మాతగా ఆమెకున్న బాధ్యతలు వేరు. ఈ సినిమా మీ అందరి ఆదరణతో విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు అఫ్సర్ ఆజాద్ మాట్లాడుతూ – దక్షిణ కాళీ చిత్రంలో కీలక పాత్రలో నటించాను. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ సత్యవాణి, డైరెక్టర్ తోట కృష్ణ గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరో సుబ్బు మాట్లాడుతూ – నేను అమ్మవారి భక్తుడిని. ఆమె దయ వల్లే ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశాను. ప్రేమికుడిగా, స్నేహితుడిగా అనేక షేడ్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం దక్కింది. మహిళలు ఏదైనా సాధించగలరు అని మా ప్రొడ్యూసర్ సత్యవాణి గారిని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వారి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరగాలి. వారికి మంచి గుర్తింపు రావాలి. ఎంతో కష్టతరమైన యాగాలు చేయడం పురాణాల్లో చదివాం. సినిమా నిర్మాణం కూడా అలాంటి యజ్ఞం చేయడం లాంటిదే. మా ప్రొడ్యూసర్ సత్యవాణి గారు సక్సెస్ ఫుల్ గా సినిమాను నిర్మించి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నారు. అన్నారు.






