అర్ధాంతరంగా జీవితాలను ముగించుకున్న నేల రాలుతున్నసినీ తారలు

ఆర్ధిక సమస్యలు, ప్రేమలో విఫలం, ఒత్తిడి, మోసపోవడం, విరక్తి, భార్య భర్తల తగాదాలు, కారణం ఏడైనా కావొచ్చు తాత్కాలిక సమస్యలను ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేషంలో మున్ముందు ఎంతో జీవితం వున్నా మధ్యలో ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. ఇందులో సామాన్యులే కాదు. స్టార్ హోదా, డబ్బు, బంధువులు స్నేహితులు, అభిమానులు ఎంతో పాపులారిటీ ఉండి అందరూ వుంది కూడా సినీ నటి నటులు ఆత్మహత్యలు చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా జరిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కూడా అలాంటిదే. రంగుల ప్రపంచంలో ఎన్నో కలలు కని చివరికి అర్ధాంతరంగా జీవితాలను ముగించిన కొందరి జీవితాలను పరిశీలిస్తే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.బుల్లి తెర నటుడిగా కెరీర్ ని ప్రారంభించి ధోనీ సినిమాతో దేశవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో సడన్‌గా చనిపోవడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆయన సూసైడ్‌కి కారణం తెలియలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిస్తా’ టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. ‘కైపోచే’ మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా ‘డ్రైవ్’ చిత్రంలో నటించాడు.
ఉదయ్ కిరణ్
ఈ పేరు వినగానే మనకు చిన్న చిరునవ్వు మొహంపై ఉన్న ఓ రూపం కళ్లముందు కనిపిస్తుంది. ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు. కారణాలు తెలియదు కానీ అప్పటి వరకు చేతినిండా సినిమాలతో ఉన్న ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. గొప్ప నటుడు అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
సిల్క్ స్మిత
బాలీవుడ్ లో బయో పిక్ తీసేంతగా పాపులర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది సిల్క్ స్మిత. తన 17 ఏళ్ళ కెరీర్ లో 400 సినిమాలకు పైగా నటించింది. ప్రధాన పాత్రలతో పాటు నృత్య తారగా, అతిధి పాత్రల్లో నటించి మెపించిన తార 1996 లో విషం తాగి ప్రాణాలను తీసుకుంది. నిర్మాతగా మారి పలు చిత్రాలను కూడా నిర్మించారు. అవి పరాజయాలు కావడం, ఆర్ధికముగా నష్టాలు తెచ్చిపెట్టడం, ప్రేమ వ్యవహారం లో విఫలం కావడం తో మద్యానికి బానిసై వత్తిడికి గురై ఆత్మ హత్య చేసుకుందని వార్తలు వచ్చాయి.
దివ్య భారతి
16 ఏళ్ళ ప్రాయంలోనే హీరోయిన్ గా తన కెరీర్ ఆరంభించింది పసిబుగ్గల అందాల తార దివ్య భారతి. తెలుగు లో వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా చిత్రం తో సినీ ప్రస్థానం మొదలైంది. ఆపై చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబు తో అసెంబ్లీ రౌడీ వంటి సక్సెసఫుల్ చిత్రాలతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ని తన చిత్రాలతో కేవలం 4 ఏళ్ళ కెరీర్ లో షుమారు 25 చిత్రాలలో నటించింది. 1992 లో సాజీద్ నదియావాలా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఏడాదికే 1993 లో తన ఫ్లాట్ 4వ అంతస్థు నుండి దూకి ప్రాణాలు కోల్పోయింది. 20 సంవత్సరాలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. అయితే ఈ మరణం ప్రమాద వశాత్తు జరిగిందా? వెనుకనుండి ఎవరైనా తోసి హత్య చేసారా? తనే ఆత్మ హత్యా చెసుకుందా? అనే విషయాలు మిస్టరీగా ఉండిపోయాయి.
ప్రత్యుష
హీరోయిన్ గా అప్పుడప్పుడే మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే మన తెలంగాణ అమ్మాయి నటి ప్రత్యుష 2002 ఫిబ్రవరి 23న మరణించింది. 1998 లో ‘రాయుడు’ చిత్రం నుండి సినీ పరిశ్రమకి పరిచయం ఐయ్యింది. ఆ తరువాత శ్రీ రాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి తో పెళ్ళికి అతడి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు విషం తీసుకున్నారని… ప్రత్యుష చనిపోగా సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయట పడ్డాడని వార్తలు వచ్చాయి అయితే ఆమె తల్లి ప్రత్యుషను హత్యా చేసారని పిర్యాదు చేసింది ఈ కథ కూడా మిస్టరీగానే వుంది పోయింది.
రంగనాథ్
ప్రముఖ సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ నటించిన రంగనాథ్‌కి రచయితగా, సాహితీవేత్తగానూ మంచి పేరుంది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపు 15 ఏళ్లపాటు సపర్యలు చేసిన రంగనాథ్.. ఆమె మృతి తర్వాత ఒంటరితనానికి గురయ్యారు. ఆ డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
జియా ఖాన్
బాలీవుడ్ లో నటిగా, గాయనిగా మంచి గుర్తింపు పొందింది జియా ఖాన్ ఆమె గజినీ, నిశ్శబ్ద్, హౌస్ ఫుల్, వంటి తదితర చిత్రాలలో నటించింది. అందం అభినయం మంచి గాత్రం వున్నా జియా ఖాన్ 2013 జూన్ న ముంబై లోని అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ప్రాణాలను తీసుకుంది. మరణానికి ముందుగా 6 పేజీల సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మ హత్య చేసుకుంది. నటుడు సూరజ్ పంచోలి తో సహజీవనం చేస్తున్న సమస్యల వలన ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కుటుంభం సభ్యులు పిర్యాదు చేసారు. ఈ నేపధ్యం లోనే సూరజ్ ని కస్టడీలోకి తీసుకున్నారు. కేసు ఇంకా కొనసాగుతుంది.
ప్రత్యుష బెనర్జీ
‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ ప్రత్యుష బెనర్జీ ఆత్మ హత్య దేశంలో పెను సంచలనం సృటించిన సంగతి తెలిసిందే. 2016 ఏప్రిల్ 1న ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 25 ఏళ్ళ తమ కుమార్తె మరణానికి కారణం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ అని ఆమె తల్లి దండ్రులు ఆరోపించారు. ప్రత్యుష ని రాహుల్ మానసికంగా వేధించాడని, ఆమె స్నేహితులతో సహా ఆమె ఆమె తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు. ప్రత్యుష మరణానికి ఘంట ముందు ఆమె కాల్ డేటా పరిశీలించి ఆ సంభాషణల ఆధారంగానే ఆమె మరణానికి కారణమని తేల్చారు. ఇంకా ఈ కేస్ ఓ కొలిక్కి రాలేదు.
కునాల్ సింగ్
‘ప్రేమికుల రోజు’ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయినా కునాల్ సింగ్ 2008 ఫిబ్రవరి 7న ముంబై లోని తన అపార్ట్మెంట్ లో ఫ్యాన్ కి వురి వేసుకుని ప్రాణాలు వదిలాడు. కునాల్ సింగ్ కూడా 33 ఏళ్ళ వయసులోనే ఆత్మ హత్య చేసుకున్నాడు. అయితే తన కుమారుడి శరీరం పై గాయాలున్నాయని ఆత్మ హత్య చేసుకునే పిరికి వాడుకాదని అతని తల్లి దండ్రులు పిర్యాదు చేసారు. అయితే కొన్ని నెలల ముందుకూడా కునాల్ చేతికి గాయం ఉందని ముందుకూడా ఒక సారి ఆత్మ హత్య కు పాల్పడ్డాడని పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో తేలింది. అసలు కారణం ఎవరికి తెలియదు.
ప్రేక్ష మెహతా
యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. క్రైం పెట్రోల్, లాల్ ఇష్క్, మేరి దుర్గ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ప్యాడ్ మ్యాన్‌లోనూ ఒక పాత్ర పోషించారు. 25 సంవత్సరాల చిన్న వయసులో 2020 మే 25న తన జీవితాన్ని ముగించింది.
కుశల్ పంజాబీ
హిందీ నటుడు కుశల్ పంజాబీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశల్ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
విజయ్ సాయి
టాలీవూడ్ హాస్యనటుడు విజయ్ సాయి కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. యూసఫ్ గూడ లో నివాసముంటున్న సాయి అతని అపార్ట్ మెంట్ లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, మంత్ర, అల్లరి, ధనలక్ష్మి తలుపు తడితే, ఒకరికి.. ఒకరు తదితర చిత్రాల్లో విజయ్ సాయి నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడమూ, మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని వార్తలు వచ్చాయి.