Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.
ఈ ముగ్గురు ఐకానిక్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. కాలం మారినా, తరాలు మారినా, వీరి స్నేహం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే భావనను ఈ వేడుక మరోసారి గుర్తుచేసింది.
చిరంజీవి నివాసం పండుగ శోభతో మెరిసిపోయింది. మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు.
“నా డియర్ ఫ్రెండ్స్ @iamnagarjuna, @VenkyMama, నా సహనటి #Nayantharaతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను.
ఇలాంటి క్షణాలే మన హృదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత..ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు” అని చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్ పోస్ట్ చేశారు.
చిరంజీవి పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు ఐకానిక్ స్టార్స్ కలిసి కనిపించడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.