Mega157: పోలీసులుగా చిరూ, వెంకీ

చిరంజీవి(chiranjeevi) హీరోగా టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను అనిల్ పరుగులు పెట్టిస్తున్నాడు. మామూలుగానే అనిల్ తన సినిమాలను వేగంగా పూర్తి చేస్తాడు. కానీ మెగా157(mega157)ను అనిల్ ఇంకాస్త త్వరగా పూర్తి చేస్తున్నట్టు కనిపిస్తుంది.
నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిసతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అనిల్ రైటింగ్ కు మెగాస్టార్ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) ఓ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా నాట్స్(NATS) లో స్వయంగా వెంకటేషే ఈ విషయాన్ని వెల్లడించారు కూడా.
అయితే మెగా157లో వెంకీ క్యారెక్టర్ కు సంబంధించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో వెంకీ చేస్తుంది క్యామియో కాదని, సినిమాలో వెంకీ క్యారెక్టర్ దాదాపు గంట పాటూ ఉంటుందని, సినిమాలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొననున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరిద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ కూడా ఉంటుందని, ఆ కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉండగా మెగా157 వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.