Ram Charan: పెద్ది కి చరణ్ భారీ ప్రియారిటీ

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్(ram charan) ఆ తర్వాత వచ్చిన ఆచార్య(acharya), గేమ్ ఛేంజర్(game changer) సినిమాలతో వరుస ఫ్లాపులను అందుకున్నారు. ఆచార్య చరణ్ సినిమా కాకపోయినా గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం చరణ్‌దే. ఎన్నో ఆశలు పెట్టుకుని శంకర్(sankar) తో చేసిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవడంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్నాడు చరణ్.
అందులో భాగంగానే చరణ్, బుచ్చిబాబు(buchibabu)తో చేస్తున్న పెద్ది(peddi) అనే పాన్ ఇండియా ప్రాజెక్టు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా, దానికి చరణ్ కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే చరణ్ పెద్ది మూవీకి భారీ ప్రియారిటీ ఇస్తున్నాడట. వాస్తవానికి చరణ్ డిసెంబర్ నాటికి పెద్దిని పూర్తి చేసి, సుకుమార్(sukumar) లేదా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్(nikhil bhatt) తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు పెద్ది సినిమాను అనుకున్నట్టు మరల్చడానికి తన కాల్షీట్స్ ను పెద్ది కోసం మరింత పొడిగించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి వరకు చరణ్ పెద్ది మూవీ కోసమే వర్క్ చేయనున్నాడని సమాచారం. 2026 మార్చి 27న పెద్ది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.