Mahavatar Narasimha: మహావతార్ను మెచ్చుకున్న చాగంటి
మహావతార్: నరసింహ(mahavatar narasimha). జులైలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. యానిమేషన్ మూవీగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటుంది. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను గీతా ఆర్ట్స్(geetha arts) సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. కింగ్డమ్(kingdom), వార్2(war2), కూలీ(coolie) లాంటి భారీ సినిమాలకు కూడా తట్టుకుని మహావతార్ నిలబడింది.
దీంతో ప్రతీ ఒక్కరికీ ఈ సినిమాను చూడాలనే ఆసక్తి పెరిగింది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ప్రముఖ ఆధ్మాత్మిక గురువు చాగంటి కోటేశ్వరరావు(chaganti koteswararao) మాట్లాడి సినిమాపై ఉన్న ఆసక్తిని ఇంకాస్త పెంచారు. తాజాగా అల్లు అరవింద్(allu aravind) ఈ సినిమాను చాగంటి కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయగా, సినిమా చూశాక ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సినిమా చాలా గొప్పగా ఉందని, సినిమాకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరినీ ప్రశంసించారు చాగంటి. దీంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలతో మహావతార్ కు వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సినిమా రిలీజై కొన్ని వారాలవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 27న రిలీజవాల్సిన మాస్ జాతర(mass jathara) కూడా వాయిదా పడటంతో ఇప్పుడు ఈ సినిమాకు అది కలిసొచ్చేలా ఉంది.







