Pooja Hegde: బుజ్జమ్మ సాంగ్ లో పూజా డ్యాన్సులు వైరల్

మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) చేతిలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలేమీ లేవు. రాధేశ్యామ్(Radhe Shyam) తర్వాత పూజాకు వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం పూజా తమిళంలో సూర్య(Suriya) సరసన రెట్రో(Retro) మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో సూర్య హీరోగా చేస్తున్న రెట్రో లో పూజా హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై పూజా గంపెడాశలు పెట్టుకుంది. మే 1న రెట్రో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టి అందులో భాగంగా రెట్రో నుంచి ఓ ఎనర్జిటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బుజ్జమ్మ(Buijjamma) అంటూ సాగే ఈ పాట వినడానికి ఎంతో క్యాచీగా ఉంది.
సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్(Kasarla Shyam) సాహిత్యం అందించగా ఈ సాంగ్ రిలీజైన కాసేపటికే యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ సాంగ్ లో చీర కట్టుకుని పూజా హెగ్డే వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు బుట్టబొమ్మ(Buttabomma) సాంగ్ లో పూజా హుక్ స్టెప్ వేయగా, త్వరగా బీస్ట్(Beast) లో అరబిక్ కుత్తు(Arabic Kuthu) కోసం మరో హుక్ స్టెప్ వేసింది. ఆ రెండు స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో బుజ్జమ్మ(Bujjamma Song) సాంగ్ లో పూజా వేసిన ఈ స్టెప్పులు కూడా అంతే వైరల్ అయ్యే అవకాశముంది.