BMW: ఎంటర్టైన్మెంట్స్ తో పాటూ ఎమోషన్స్ కూడా
త కొన్ని సినిమాలుగా మాస్ మహారాజా రవితేజ(raviteja)కు సరైన సక్సెస్ లేదనే విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా రూట్ మార్చి సక్సెస్ అందుకోవాలని ఎంతో కసిగా ఉన్నారాయన. ఈ నేపథ్యంలోనే కిషోర్ తిరుమల(kishore tirumala) దర్శకత్వంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి(bhartha mahasayulaki wignyapthi) అనే సినిమాను చేయడమే కాకుండా ఆ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపి, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 2 నిమిషాల 19 సెకన్ల రన్ టైమ్ తో రిలీజైన ఈ సినిమా ట్రైలర్ బాగా ఎంటర్టైనింగ్ ఉంది. కథేంటో ట్రైలర్ లోనే ఓ క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ట్రైలర్ చూస్తుంటే మూవీలో కుటుంబ అనుబంధాలతో పాటూ ఎమోషన్స్, వినోదం కూడా ఉంటుందని అర్థమవుతుంది.
మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే పండక్కి ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అనిపించేలా ఉంది. డింపుల్ హయాతి(Dimple Hayathi), ఆషికా రంగనాథ్(Aashika Ranganath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సత్య(satya), సునీల్(suneel), మురళీధర్ గౌడ్(muralidhar goud) కీలక పాత్రల్లో కనిపించనుండగా, భీమ్స్(Bheems) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్(SLV Cinemas) బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి(sudhakar Cherukuri) ఈ మూవీని నిర్మించాడు. మరి ఈ సినిమా అయినా రవితేజకు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.






