Bhairavam: భైరవం రన్ టైమ్ ఎంతంటే

కెరీర్లోని ప్రైమ్ టైమ్ ను మూడేళ్ల పాటూ ఛత్రపతి(Chatrapathi) రీమేక్ కోసం వేస్ట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఆ సినిమాతో దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నాడు. దీంతో తిరిగి టాలీవుడ్ లోకి వచ్చి సినిమాలను లైన్ లో పెట్టి అందులో భాగంగానే నాంది(Nandhi) ఫేమ్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో భైరవం(Bhairavam) అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో నారా రోహిత్(Nara Rohit), మంచు మనోజ్(Manchu Manoj) కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆరేళ్ల తర్వాత మంచు మనోజ్ ఈ భైరవం సినిమాతోనే తిరిగి సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తున్నాడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్(Shankar) కూతురు అదితి శంకర్(Aditi Shankar) హీరోయిన్ గా నటిస్తోంది. భైరవం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ఫుల్ స్పీడప్ చేసింది. ఓ వైపు ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
భైరవం సినిమా సెన్సారు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి ఎ సర్టిఫికెట్ అందుకుంది. దీంతో పాటూ సినిమా రన్ టైమ్ కూడా బయటికొచ్చింది. భైరవం సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుందట. తమిళ సూపర్ హిట్ సినిమా గరుడన్(Garudan) కు రీమేక్ గా రానున్న ఈ సినిమా సక్సెస్.. భైరవంలో ప్రధాన పాత్రల్లో నటించిన ముగ్గురికీ ఎంతో కీలకం కానుంది.