Anupama: లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై అనుపమ ఏమందంటే

హీరోయిన్లు అందరికీ ఎప్పుడైనా కెరీర్లో ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా చేయాలని ఆశ ఉంటుంది. అయితే అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. ఛాన్స్ వస్తే ఎవరైనా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనే చూస్తారు. అలా అని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందా అంటే లేదు. హీరో ఓరియెంటెడ్ సినిమాలు, కమర్షియల్ సినిమాలను ఆదరించినట్టు ఆడియన్స్ ఈ సినిమాలను ఆదరించరు.
రీసెంట్ గా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anirudh Parameswaran) లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఓపెన్ గా మాట్లాడారు. సినిమా పోస్టర్ మీద కేవలం అమ్మాయి ఫోటో ఒకటే ఉంటే దాన్ని చూడ్డానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరని, ఆ సినిమాలను చూడ్డానికి ఎవరూ ముందుకు రారని,ఆ మూవీ కోసం థియేటర్ వరకు వెళ్లాలా అనుకుంటారని అని మొహమాటం లేకుండా చెప్పింది అనుపమ.
అనుపమ చెప్పింది అక్షరాలా నిజం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఏ హీరోయిన్ దీని గురించి మాట్లాడింది లేదు, నిజాన్ని ఒప్పుకుంది లేదు. కానీ అనుపమ మాత్రం చాలా హుందాగా ఈ విషయంపై మాట్లాడి నిజాన్ని ఒప్పుకున్నారు. అనుపమ ప్రధాన పాత్రలో పరదా(Paradha) అనే సినిమా చేసింది. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏడాది ముందే పూర్తైనప్పటికీ వివిధ కారణాల వల్ల రిలీజ్ లేటవుతూ వచ్చింది. ఆగస్ట్ 22న పరదా ను రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ ను ఫిక్స్ చేశారు.