Peddi: త్వరలోనే పెద్ది నుంచి మరో లుక్

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన గేమ్ ఛేంజర్(Game Changer) రామ్ చరణ్ కు, అతని ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ మిగల్చడంతో ఇప్పుడు వారి దృష్టంతా చరణ్ నెక్ట్స్ మూవీ అయిన పెద్ది పైనే ఉంది.
ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ మూవీపై భారీ అంచనాలుండగా, మొన్నా మధ్య ఫస్ట్ షాట్(First Shot) పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ కు కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి చరణ్ ఫ్యాన్స్ కు మరో సర్‌ప్రైజ్ రానుంది.
ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ కు సంబంధించిన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లుక్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పెద్ది నుంచి సెకండ్ లుక్ ను మేకర్స్ త్వరలోనే లేదా వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసే అవకాశముందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.