Anaganaga: రేర్ ఫీట్ ను సాధించబోతున్న అనగనగా

సన్నీ సంజయ్(Sunny Sanjay) అనే కొత్త దర్శకుడు, సుమంత్(Sumanth) తో కలిసి చేసిన సినిమా అనగనగా(Anaganaga). రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అనగనగా గురించి క్రిటిక్స్ కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఫలితంగా ఈటీవీ విన్ లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో ఫ్రీ ప్రీమియర్లు వస్తే అవి హౌస్ ఫుల్స్ అయ్యాయి. ప్రీమియర్లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఈ సినిమాకు అతి త్వరలో పెయిడ్ షోలు వేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు హీరో సుమంత్ వెల్లడించాడు. ఏదైనా సినిమా ముందు థియేటర్ రిలీజై తర్వాత ఓటీటీలోకి వస్తుంది.
కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో ఓటీటీలో రిలీజై హిట్ అయిన సినిమా ఇప్పుడు థియేటర్లకు వెళ్తుంది. గతంలో దిల్ రాజు(Dil Raju) కూడా నాని(Nani) హీరోగా వచ్చిన వి(V The Movie) సినిమాను ఇలానే రిలీజ్ చేశాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. కానీ అనగనగా సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా థియేట్రికల్ రిజల్ట్ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.