‘అసలైన నిద్ర’ డ్యూరోఫ్లెక్స్ తోనే అంటున్న అలియా భట్
నిద్రకు సంబంధించిన ముఖ్య విషయానికి వస్తే బాగా అధ్యయనం చేయబడిన ఎం పికల ప్రాధాన్యంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూ షన్స్ ప్రొవైడర్ అయిన డ్యూరోఫ్లెక్స్ తమ జాతీయ ప్రచారకర్త, ప్రముఖ నటి అలియా భట్ ఒక నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ హెల్త్ అకాడమీలో వైద్యులచే సిఫారసు చేయబడిన తన సిగ్నేచర్ పోర్ట్ ఫోలియో డ్యూరోపెడిక్ ను ఈ సందర్భంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. ఈ క్యాంపెయిన్ రెండు టీవీసీలతో విని యోగదారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంది. చక్కటి నిద్ర విషయానికి వస్తే, పరిశోధన మరియు నిపుణులచే ఆమోదించబడిన స్లీప్ ఎసెన్షియల్స్ ను మాత్రమే అంతా విశ్వసించాలి అనే సందేశాన్ని ఇది అందిస్తుంది. అన్నింటికీ ఒకే సైజు అనేది మ్యాట్రెస్ ల విషయంలో వర్తించదనే అంశంపై మొదటి టీవీసీ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. ఆకర్షణయంగా కనిపించే డీల్స్ కు ఆకర్షితులు కావడం, తప్పుడు ఎంపికలు చేసుకోవడంపై హెచ్చరించేదిగా మరొక టీవీసీ ఉంటుంది.
దేశవ్యాప్తంగా రెండేళ్లుగా ఆరోగ్యంపై, వ్యక్తిగత సంక్షేమంపై బాగా దృష్టి పెడుతున్నారు. నేడు వినియోగదారులు ఆరోగ్యదాయక జీవనశైలిని అందించే విషయాలపై ముందెన్నడూ లేని విధంగా వ్యయం చేయడానికి ఇష్ట పడుతున్నారు. అలాంటి ముఖ్య విషయాలలో స్లీప్ సొల్యూషన్ కూడా ఒకటి. ఎన్నో బ్రాండ్లు ఈ విభాగంలోకి వస్తున్న సందర్భంలో వీటి కొనుగోలు అనేది వినియోగదారులకు మరింత సంక్లిష్టంగా మారింది. అత్యున్నత స్థాయి మెటీరియల్స్ పై తప్పుడు ప్రచారాలు, మెటీరియల్ ప్రయోజనాలపై తప్పుడు వ్యాఖ్యానాలతో వినియోగ దారులు తరచూ తమ నిర్దిష్ట అవసరాలను తీర్చని మ్యాట్రెస్ లను కొంటున్నారు. ఫలితంగా నిద్ర అంతరాయా లు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో ముఖ్యమైన ఈ అంశంపై తమ నూతన ప్రచారం ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించడాన్ని డ్యూరోఫ్లెక్స్ తన లక్ష్యంగా చేసుకుంది.
మొదటి టీవీసీలో అలియా, తన స్నేహితుడు, వైట్ టైగర్ ఫేమ్ ఆదర్శ్ గౌరవ్ తన మ్యాట్రెస్ తో అసౌకర్యంగా నిద్రించడాన్ని గమనిస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మరెన్నో అంశాలను తెలియజేస్తుంది. అది మె మరీ ఫోమ్, అది తన వెన్నెముకకు మంచిదనే ఉద్దేశంతో ఆదర్శ్ ఆ మ్యాట్రెస్ ను తీసుకువస్తాడు. అందుకు అలియా బదులిస్తూ, ‘‘ప్రతీ మెమరీ ఫోమ్ ఆర్థోపెడిక్ కాదు, ప్రతీ నిద్ర నిద్ర కాదు’’ అంటూ చెబుతుంది. దాన్నే మరింతగా వివరిస్తూ, నిర్దిష్ట సమస్యలకు డ్యూరోఫ్లెక్స్ యొక్క, డాక్టర్లచే సిఫారసు చేయబడిన ఆర్థోపెడిక్ శ్రేణి మ్యాట్రెస్ ల గురించి తెలియజేస్తుంది. ఈ మ్యాట్రెస్ లు అడ్వాన్స్ డ్ 5 జోన్ సపోర్ట్ లేయర్ తో ఉంటాయి.
ఇక రెండో టీవీసీ 15 సెకన్ల స్వల్ప వివరణతో ఉంటుంది. ఉచిత ట్రయల్ కాలం వంటి ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్లకు ఆకర్షితులైపోవద్దని, వాటితో సరైన నిద్ర లేక తన స్నేహితులకు బ్లాక్ సర్కిల్స్ వచ్చినట్లుగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇందులో అలియా వినియోగదారులకు సూచిస్తారు. అసలైన అందమైన నిద్ర విశ్వసనీయమైన డ్యూరోపెడిక్ శ్రేణితోనే ఉందని, డ్యూరోఫ్లెక్స్ వంటిది మరొకటి లేదని అలియా అంటారు.
నూతన క్యాంపెయిన్ గురించి డ్యూరోఫ్లెక్స్ ప్రచారకర్త అలియా భట్ మాట్లాడుతూ, ‘‘నిద్ర నా మనస్సుకు ఎంతో సన్నిహితం. అదే నా అద్భుత శక్తి. దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చక్కటి రాత్రి నిద్రకు సరై న మ్యాట్రెస్ అవసరాన్ని కొంతమంది మాత్రమే గుర్తించారు. పైగా అయోమయానికి గురి చేసే సాంకేతిక క్లెయి మ్స్, బ్రాండ్లు అందించే డీల్స్, ప్రజలు తమ అవసరాలకు సరిపోని మ్యాట్రెస్ లను కొనేందుకు దారి తీస్తున్నాయి. నూతన డ్యూరోఫ్లెక్స్ టీవీసీ ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని అన్నారు.
నూతన క్యాంపెయిన్ గురించి డ్యూరోఫ్లెక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్మితా మురార్కా మాట్లాడుతూ, ‘‘బాగా పరి శోధించబడిన ఉత్పాదనలు తయారు చేయడం మొదలుకొని నిద్ర ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ఏవిధంగా ప్రభా వితం చేస్తుందనే దాకా భారతదేశ ప్రజలు మెరుగ్గా నిద్రపోవాలన్నదే మా ఆశయం. ఇది మరెంతో మంది విని యోగదారులు బ్రాండెడ్ మ్యాట్రెస్ వైపు మళ్లేలా చేసింది. అయితే మ్యాట్రెస్ కొనుగోలు అనేది ఓ సంక్లిష్ట పనిగా మారింది. వినియోగదారులు సరిగా అర్థం చేసుకోలేని అంశాలతో కొనుగోలును నిర్వహిస్తున్నారు. మార్కెట్లో చో టు చేసుకుంటున్న సాధారణ లేదా తప్పుడు క్లెయిమ్స్ వినియోగదారులను మరింతగా గందరగోళపరుస్తున్నా యి. నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా, తమ వ్యక్తిగత అవసరాలకు తగిన విధంగా ఉండే, బాగా పరి శోధించబడిన ఎంపికలు చేసుకోవడంపై వినియోగదారులకు అవగాహన కల్పించవచ్చని మేం విశ్వసిస్తున్నాం. అసలైన నిద్రకు కావాల్సింది డ్యూరోఫ్లెక్స్ అనే విధంగా మేం మా వినియోగదారులతో అనుసంధానం కావడం ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం’’ అని అన్నారు.
ఈ టీవీసీ ప్రముఖ జాతీయ టీవీ చానళ్లలో ప్రసారం కానుంది. డిజిటల్ చానల్స్ ప్రమోట్ కానుంది.
డ్యూరోఫ్లెక్స్ సాంకేతికతతో కూడిన స్లీప్ సొల్యూషన్ ప్రొవైడర్, ఈ బ్రాండ్ కు మాత్రమే పరిమితమైన ప్రత్యేకతలను అది అందిస్తుందనే సందేశాన్ని, ‘నథింగ్ లైక్ డ్యూరోఫ్లెక్స్’ ట్యాగ్ లైన్ పునరుద్ఘాటిస్తుంది. దీని అధునాతన 5 జోన్డ్ ఆర్థోపెడిక్ శ్రేణి, శరీరం యొక్క 5 జోన్లకు భిన్నరీతుల్లో సపోర్ట్ ను అందిస్తుంది. దీని ఫలితంగా చక్కటి బాడీ అలైన్ మెంట్ తో అది అన్ని నిద్ర సమస్యలను పరిష్కరించగలుగుతుంది. ఇది శాస్త్రీయంగా రూపొందించబడి విశ్వసించబడింది మరియు డాక్టర్లచే సిఫారసు చేయబడింది. డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రెస్ లు మీ శరీరానికి అత్యుత్తమ సంరక్షణను అందిస్తాయి. మీ వెన్నెముకకు మంచి సపోర్ట్ నూ అందిస్తాయి. చక్కటి రాత్రి నిద్రనూ అందిస్తాయి.
ఈ సిగ్నేచర్ శ్రేణి ఈ బ్రాండ్ వెబ్ సైట్ https://www.duroflexworld.com/ పై, సంస్థ ఎక్స్ క్లూజివ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ లో, అదే విధంగా ప్రముఖ స్టోర్స్ లో లభ్యమవుతుంది.
డ్యురోఫ్లెక్స్ గురించి:
డ్యురోఫ్లెక్స్ భారతదేశ అగ్రగామి స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ లో ఒకటి. ఇది విస్తృత శ్రేణిలో ప్రీమియం మ్యాట్రెసెస్ లను, స్లీప్ యాక్సెసరీస్ లను అందిస్తోంది. ఈ విప్లవాత్మక బ్రాండ్ ఐదు దశాబ్దాల నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకేతికత లతో నాణ్యమైన నిద్రను పునర్ నిర్వచిస్తోంది.
భారతదేశంలోనే మొదటివిగా చెప్పబడే వినూత్న, అత్యంత అధునాతన ఉత్పాదనలతో డ్యురోఫ్లెక్స్ అనేది పరిశ్రమలోనే లీడర్ గా విశిష్టతతో ఉంటోంది. దీని సిగ్నేచర్ శ్రేణి డ్యూరోపెడిక్ భారతదేశ మొట్టమొదటి మరియు డాక్టర్ ధ్రువీకృత ఏకైక ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ శ్రేణి. ఈ బ్రాండ్ నేడు నాణ్యత, వినూత్నత, సౌఖ్యంలకు మారుపేరుగా నిలిచింది. పటిష్ఠమైన సాంకేతి కత, ఆధునిక ఉఫకరణాలు, భవిష్యత్ అవసరాలను అర్థం చేసుకునే శక్తిసామర్థ్యాలతో దీని ఉత్పాదన పోర్ట్ ఫోలియో ఉంది.
Follow us on @duroflexworld






