అక్కినేని కుటుంబానికి ఎన్నార్ బయోపిక్ చేసే ఉద్దేశం లేదా?

ఇప్పట్లో ఆ ఉద్దేశం లేనట్లే కనపడుతుంది. తెలుగు సినీ కళామతల్లి కి ఎన్టీఆర్ ఎన్నార్ ఇద్దరు రెండు కళ్ళు అనేవారు. మహానటుడు యన్ టి ఆర్ జీవిత కథ తో కథానాయకుడు-యన్ టి ఆర్, మహానాయకుడు -యన్ టి ఆర్ అనే టైటిల్స్ తో రెండు బయోపిక్ చిత్రాలు రావడం జరిగింది. అదే విధంగా మహా నటులు ఏ ఎన్ ఆర్ జానపదాల చిత్రాలతో కెరీర్ మొదలు పెట్టి తరువాత సాంఘీక చిత్రాలతో ఆకట్టుకున్న అక్కినేని తెలుగు తెర మీద తొలి రొమాంటిక్ హీరో అన్న పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఏఎన్నార్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రస్తావన కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. అయితే అక్కినేని నాగార్జున మాత్రం తండ్రి ఏఎన్నార్ బయోపిక్ మీద సీరియస్ దృష్టి పెట్టలేదు.
కానీ ఇతర హీరోలు హీరోయిన్ల బయోపిక్‌లు రూపొందుతుండటంతో అక్కినేని అభిమానులు ఏఎన్నార్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగానే ఈ లెజెండరీ స్టార్ బయోపిక్ తెరకెక్కిస్తే అక్కినేని పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కొడుకు నాగార్జున కమర్షియల్ హీరోగా మంచి ఫాంలో ఉన్నాడు. అయితే అక్కినేని హావ భావాలు పలికించటం మాత్రం కాస్త కష్టమే ఆహార్యంలోనూ తండ్రిని నాగ్‌లో చూడలేం. ఇక నాగచైతన్య.. ఇప్పటికే మహానటి సినిమాలో తాత పాత్రలో నటించాడు. అయితే అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రా కాబట్టి పెద్దగా ఆకట్టుకున్నట్టుగా అనిపించలేదు. ఏదో ఆ పాత్రకు మనవడు చేశాడన్న పేరు తప్ప అక్కినేనిని గుర్తు చేసేలా లేదు నాగచైతన్య నటన.
ఇక అఖిల్ విషయానికి వస్తే.. ఇంకా హీరోగానే ప్రూవ్ చేసుకోని అఖిల్ తాత పాత్రలో నటించటం అంటే రిస్క్ చేయటమే అవుతుంది. ఆ రిస్క్ అఖిల్ చేయకపోవచ్చు. మరో మనవడు సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేనిగా నటించాడు. అంతేకాదు తెర మీద తాతను గుర్తు చేశాడు కూడా. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి సుమంత్ ఫుల్ లెంగ్త్‌తో తాత పాత్రలో నటిస్తాడేమో చూడాలి. లేదా అక్కినేని పోలికలతో వుండే బయటి నటులెవరైనా చేస్తారేమో చూడాలి. మరి మహానటి చిత్రం లో జీవించిన కీర్తి సురేష్ కి సావిత్రి కి ఎలాంటి రక్త సంబందం లేదు అయితేనేం అవార్డులతో రివార్డులతో సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం అయ్యింది.