Ghaati: ఘాటీ ఇంటర్వెల్ తర్వాత యాక్షనే!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) నుంచి ఆ సినిమా తర్వాత మరో మూవీ వచ్చింది లేదు. అయితే ఆ సినిమా వచ్చిన చాలా రోజులకు అనుష్క క్రిష్ జాగర్లమూడి(krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను ఒప్పుకుని దాన్ని రిలీజ్ కు రెడీ చేసింది. అనుష్క, క్రిష్(krish) కాంబోలో గతంలో వేదం సినిమా రాగా ఆ మూవీలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది.
వేశ్య పాత్ర అయినప్పటికీ ఆ క్యారెక్టర్ లో ఎలాంటి వల్గారిటీ లేకుండా క్రిష్ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు ప్రశంసలందుకుంది. అలాంటి వీరిద్దరి కలయికలో ఇప్పుడు ఘాటీ(ghaati) సినిమా వస్తోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరో 6 రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఘాటీ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 2 గంటల 37 నిమిషాల నిడివితో సెన్సార్ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ తో చిత్ర యూనిట్ ను ప్రశంసించిందని సమాచారం. ఈ సినిమాలో మొత్తం మీద 8 పెద్ద యాక్షన్ సీన్లు ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఘాటీ కథ ఎమోషనల్ గా ఉంటుందని, ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్ లోకి వెళ్లి ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుందని చెప్తున్నాయి.