Sri Charani: క్రికెటర్ శ్రీచరణి కి .. మంత్రుల ఘనస్వాగతం
భారత క్రికెటర్ శ్రీచరణి (Sri Charani) గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు (Ministers) అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup)లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్ఇండియా (Team India) జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఆమె విజయవాడకు బయలుదేరారు.







