7 Hills Satish: నిర్మాత నుంచి దర్శకుడిగా మారుతున్నా: సెవెన్ హిల్స్ సతీష్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ (7 Hills Satish) తన పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. 3 విజయవంతమైన సినిమాలను నిర్మించి సతీష్.. త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే తన బ్యానర్‌లో ఇంకో రెండు సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. నార్నె నితిన్ హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో సినిమా చేస్తున్నామని చెప్పారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు.
సోలోబాయ్ ఈవెంట్‌లో తన గురువు వీవీ వినాయక్ చెప్పిన విధంగా తాను డైరెక్టర్ అవ్వాలనే ప్రయత్నాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా మొదలు పెట్టినట్లు సెవెన్ హిల్స్ సతీష్ తెలిపారు. మూడు సినిమాల అనుభవంతో వచ్చే ఏడాది దర్శకుడిగా మారబోతున్నట్లు చెప్పారు. తన స్నేహితుల సహాయంతో వాళ్ల నిర్మాణంలో తన మొదటి సినిమా డైరెక్షన్ చేయబోతున్నట్లు చెప్పారు. తొలిసారి మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి గ్రాండ్‌గా బర్త్ డే జరుపుకోవడం కొత్తగా ఉందన్నారు. ప్రభాస్ పుట్టినరోజే తన బర్త్ డే కావడం హ్యాపీగా ఉందన్నారు.
ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ సతీష్ ప్రెస్‌మీట్‌లో మరిన్ని విషయాలు మాట్లాడుతూ..‘‘నేను మీడియా ముఖంగా ఎప్పుడూ బర్త్ డే చేసుకోలేదు. నా ఫ్రెండ్స్ నాకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తప్పకుండా బర్త్ డే చేసుకోవాలని సూచించారు. మూడు సినిమాల నిర్మాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అన్ని క్రాప్ట్‌లకు సంబంధించి విషయాలు నేర్చుకున్నాను. వయసులో ఉన్నప్పుడే డైరెక్షన్ చేయాలని వీవీ వినాయక్ గారు చెప్పడంతో డైరెక్టర్‌గా మారుతున్నా. నార్నె నితిన్ డేట్స్ అలాగే ఉన్నాయి. కథ ఓకే అయితే ఆయనతో సినిమా చేస్తాను. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. డైరెక్టర్‌గా డెబ్యూ మూవీ అనేది చాలా ముఖ్యం. మంచి సినిమా చేస్తేనే మన ట్యాలెంట్ ఏంటనేది బయటపడుతుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం మనం మెసేజ్ ఇస్తే చూసే మూడ్‌లో ఆడియన్స్ లేరు. అందుకే నవ్వించి ఎంటర్‌టైన్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు బలగం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలతో అది ప్రూవ్ అయింది. అందుకే తక్కువ బడ్జెట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను. చాలా వేరియన్స్ ఉన్న స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా.
సినిమా మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. నిజాయితీగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. నిర్మాతగా బట్టల రామస్వామి బయోపిక్ మంచి డబ్బులు వచ్చాయి. రెండో సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నేను నిర్మించిన మూడు సినిమాలు కూడా కొత్త వాళ్లతో చేశాను. డైరెక్టర్‌గా కూడా కొత్తవాళ్లతో చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే డేట్స్ ఇబ్బంది ఉండదు. ఎవరైనా హీరో ఓకే అయినా చేస్తా. వేరే ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక మనం చేసే మంచి సినిమాను ఇంకెంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. రివ్యూలు జెన్యూన్‌గా ఇస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్‌గా నేను ఏంటనేది నిరూపించుకుంటే తర్వాత పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం. లిటిల్ హార్ట్స్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే దర్శకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి సినిమా తీసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా ఫేవరెట్ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది.’’ అని తెలిపారు
ముందుగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కొంత డబ్బులు సంపాదించి, ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని నాకు తెలుసు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు వంటి వారు నాకు మంచి స్నేహితులు. అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా వేరే ప్రొడక్షన్స్‌లో కూడా పనిచేశాను. ఆ సమయంలో నందినీ రెడ్డి, మచ్చ రవి, నేచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. ఎన్నో వేలమంది, లక్షలమంది చూసి ఆదరించే సినిమాను.. వారు సంతృప్తి పరిచే విధంగా ఉండాలంటే ముందు కథ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. నేను అటువంటి జాగ్రత్తలే తీసుకుని సినిమాలు తీస్తున్నాను. అలాగే సినిమాలు చేయడానికి ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. నాకు సినిమాలు అంటే అటువంటి పిచ్చే ఉంది. అందుకే సెలక్టెడ్‌గానే సినిమాలు చేస్తున్నాను.