Bhagyasri Borse: అనుష్క గారు అరుంధతిలో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం – భాగ్యశ్రీ బోర్సే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ముందుగా కంగ్రాజులేషన్స్.. కాంత సినిమాకి, మీ పర్ఫార్మెన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఎలా అనిపించింది?
-చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు నటిగా నాలో ఉన్న పొటెన్షియల్ చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.
ఆంధ్ర కింగ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఆంధ్ర కింగ్ లో నేను మహాలక్ష్మి క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. సాగర్ తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్ గురించి రివిల్ చేయకూడదు. కథలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలా వుంటుంది.
మహేష్ గారు ఈ కథ చెప్తున్నప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?
-అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్ కొచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్ ని ఇంత గొప్పగా ఆరాధిస్తారో ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్. ఎలాంటి రిలేషన్ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. మహేష్ ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఉపేంద్ర గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
-ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయన వెరీ హంబుల్ యాక్టర్. చాలా డౌట్ టు ఎర్త్. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
సాగర్ మహాలక్ష్మి లవ్ స్టోరీ ఎంత కొత్తగా ఉండబోతుంది?
-ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలు మీరు చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ ఇందులో ఉంటుంది.
రామ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రార్ గారితో నటించడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ . వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. రామ్ గారు చాలా పాజిటివ్ గా ఉంటారు.
.ఈ సినిమా మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి?
సినిమా ఆల్బమ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పాటలన్నీ ఇష్టం. అయితే నాకు ఫేవరెట్ నువ్వుంటే చాలు.
ఇది పిరియడ్ సినిమా కదా కాస్ట్యూమ్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
ఇది 2000లో జరిగే కథ, డైరెక్టర్ గారు కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నిటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇందులో మీకు చాలెంజింగ్ గా అనిపించినా సీక్వెన్స్ ఉందా?
ఇందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది.డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎలా అనుకుంటున్నానో చేసి చూపిస్తాననిడైరెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను. నేను చేసింది అందరికీ నచ్చింది. అంత క్రియేటివ్ స్పేస్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.
మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రవి గారు నవీన్ గారు నేను కలిసిన ఫస్ట్ ప్రొడ్యూసర్సు. వాళ్లతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాతో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. చాలా పాషన్ ప్రొడ్యూసర్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు.
షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి?
-ఒక షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళాం. అక్కడ చాలా వేడిగా ఉంది. అయితే ఒక టీం గా సినిమా కోసం వర్క్ చేయడంలో చాలా ఎంజాయ్ చేశాం.
-ఈ సినిమాలో తులసి గారు రావు రమేష్ గారు మురళి శర్మ గారు ఇలా అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రావు రమేష్ గారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది., అలాగే రాహుల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది.
మీరు ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు?
నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి క్యారెక్టర్ కి 100% ఇచ్చి ఒక వెర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క గారు అరుంధతిలో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను.
మీరు చేసిన రెండు సినిమాలకే చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.. ఎలా అనిపిస్తుంది?
ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ఇలాంటి సపోర్టు ఉండదు. అందరూ కూడా తమ అమ్మాయిగా అభిమానాన్ని చూపించారు.ఇలాంటి అభిమానం గౌరవం ప్రేమ మరింత పొందాలని కోరుకుంటున్నాను.






