ప్రపంచ సవాళ్లపై రెండు దేశాలూ కలిసి పని చేయాల్సి ఉంది
అమెరికా, చైనాల మధ్య సత్సంబంధాలు అవసరమేనని, ప్రపంచ సవాళ్లపై రెండు దేశాలు కలిసి పని చేయాల్సి ఉందని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ స్పష్టం చేశారు. అయితే చైనా పట్ల తమకు కొన్ని విషయాల్లో అభ్యంతరాలుంటాయని పారిస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె వ్యాఖ్యానించారు. జిన్పింగ్ ఓ నియంతని బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్లెన్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యాఖ్యలను గౌరవిస్తున్నానని, అయితే కొన్ని అంశాల్లో చైనాతో కలిసి పని చేయాలనే అధ్యక్షుడితో సహా తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. అమెరికా, చైనా మధ్య సత్సబంధాల కోసం ఎల్లెన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ సుస్థిరతకు రెండు దేశాలు కలిసి చేయాలని ఆమె వాదిస్తున్నారు.






