WhatsApp: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. గ్రూపులో చేరితే
వాట్సప్‌లో మరో కొత్త స్కామ్ నివారణ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సేఫ్టీ ఓవర్‌వ్యూ (Safety Overview) పేరిట దీన్ని లాంచ్ చేసింది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని, తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా గ్రూప్‌లో యాడ్ (Ad) చేసినపుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆ గ్రూప్ (Group ) నకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఫిషింగ్, స్కామ్‌ల నుంచి ముప్పు నుంచి ఎలా జాగ్రత్తపడాలో అందులో సూచనలు కనిపిస్తాయి. మోసాలు అరికట్టడంలో భాగంగా వాట్సప్ ఆ కోవకు చెందిన 6.8 మిలియన్ ఖాతాలను ఇప్పటికే బ్యాన్ చేసింది. ఈ చర్యల్లో భాగంగానే సేఫ్టీ ఓవర్‌వ్యూ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాట్సప్ తన బ్లాగ్‌పోస్ట్ (Blogpost ) లో పేర్కొంది.







