వాట్సాప్ పేమెంట్స్ ఇలా…
వాట్సాప్ ద్వారా లావాదేవీలు జరపడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చెల్లింపులు జరపడం కోసం వినియోగదారుడు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ పేమెంట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత పేమెంట్ జరిపే విధానాన్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ బ్యాంకు నుంచి పేమెంట్ చేస్తే బ్యాంకు వివరాలను రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో ధ్రువీకరించుకోవాలి. వెరిఫికేషన్ ముగిసిన తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు కనిపిస్తాయి. తర్వాత నేరుగా వాట్సాప్ నుంచే చెల్లింపులు జరుపవచ్చు.






