తుపాకుల విక్రయం ఆపిన వాల్‌మార్ట్
అమెరికాలోని తన దుకాణాల్లో తుపాకులు, మందుగుండు సామగ్రి విక్రయాలను రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నిలిపివేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పౌర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అమెరికాలో వాల్‌మార్ట్‌కు 4700 దుకాణాలు ఉన్నాయి. వాటిలో కనీసం సగం స్టోర్లలో ఆయుధాలను విక్రయిస్తోంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ప్రతిష్టంభన ఏర్పడితే హింసాత్మక ఘర్షణలు అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్న అంచనాలూ ఉన్నాయి. కొవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితులు, జాతుల వైరం, రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో ఇటీవల అమెరికాలో ఆయుధ విక్రయాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికాలో జనాభా కన్నా తుపాకుల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.






