జూన్ లో ఫెడ్ రేట్ల కోత లేనట్లే!

అమెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాల కంటే అధికంగా పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ ( సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నెల వారీగా చూస్తే 0.4 శాతం పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 12 నెలల కిందటితో పోలిస్తే సీపీఐ 3.5 శాతం పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో ఇది 3.2 శాతంగా నమోదైంది. వరుసగా మూడో నెలా ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యమైన 2 శాతం కంటే పైనే నమోదు కావడంతో, వచ్చే జూన్‌లో రేట్ల కోతలు ఉండకపోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు రేట్ల కోతను ఫెడ్ ఆలస్యం చేయొచ్చని అంటూన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో అమెరికా స్టాక్‌మార్కెట్లు 1 శాతం వరకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.