ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు : ఫెడరల్ రిజర్వు
అమెరికా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితితో కూడిన ప్రపంచ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని, మరింతగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేక పోలేదని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జెరోమ్ పాలెల్ హెచ్చరించారు. గత సంవత్సర కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుదల దిశలోనే పయనిస్తోందని, మరింత ఆశ్చర్యకర పరిస్థితులు తలెత్తవచ్చని సెమీ యాన్యువల్ టెస్టిమనీలో ఆయన అన్నారు. ఇప్పటికే 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వు కట్టుబడి ఉంది. ప్రపంచంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఇప్పుడు కఠిన పరిస్థితులను చూస్తోందని, కానీ సమర్థవంతంగా వీటిని ఎదుర్కొంటామని పావెల్ తెలిపారు.






