అమెరికాకు అతి పెద్ద ఉపశమనం… 2025 వరకూ
ఆర్థిక చెల్లింపుల సంక్షోభం నుంచి అమెరికాకు అతి పెద్ద ఉపశమనం లభించింది. అదనపు అప్పులకు రిపబ్లికన్లు ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతినిధుల సభ ఓటింగ్‌లో అప్పుల పరిమితి పెంపు బిల్లుకు అనుకూలంగా 314 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లు వచ్చాయి. అంతకుముందే అధ్యక్షుడు జైడెన్, స్పీకర్ మెకార్థీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రిపబ్లికన్లు ఓటేశారు. దీంతో ఇక బిల్లు వచ్చేవారం సెనేట్‌కు వెళ్లనుంది. అక్కడ డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో ఆమోదం లాంఛనమే. బిల్లు పూర్తిగా ఆమోదం పొందితే 2025 వరకు అమెరికా అదనపు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెరికా అప్పుల పరిమితి 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దానిని దాటి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.






