మరో వివాదంలో సునాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోక వివాదంలో చిక్కుకున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సి దశలో, ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారు. ప్రముఖ ఆంగ్లకళాకారుడు రూపొందించిన కాంస్య శిల్పం కొనుగోలు ఇప్పుడు విమర్శలకు దారితీసింది. దీనికోసం 15 లక్షల పౌండ్లు ఖర్చు చేయడం, దాని ప్రధాని బంగ్లాలోని గార్డెన్‌కు తరలించాలనే నిర్ణయం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 1980 నాటిశిల్పం క్రిస్టీ వేళంలో గత నెల ప్రభుత్వం కొనుగోలు చేసింది. ద్రవ్యోబల్బణం, విద్యుత్ బిల్లులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించాల్సిన ప్రభుత్వం దుబారా చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ కళాఖండాన్ని కొనుగోలు చేయాలనే నిర్ణయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని తెలిసింది.






