మేం ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాం
ప్రస్తుతం తాము ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నామనీ, పరిస్థితి మరింత దిగజారుతోందని బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ వెల్లడించారు. దిగువ సభలో ఆయన అత్యవసర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లక్షలమందిపై ప్రభావాన్ని చూపే రీతిలో పన్నులను పెంచారు. 2024 వరకు ఆర్థిక వృద్ధిని ఆశించలేమనీ, రష్యా`ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఇంధన, ద్రవ్యోల్బణ, ఆర్థిక రంగ సంక్షోభం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పన్నుల పెంపు, ప్రభుత్వ ఖర్చులో కోతల ద్వారా బడ్జెట్ల్లో 5,500 కోట్ల ఫౌండ్లు ఆదా చేయబోతున్నట్లు తెలిపారు.






