ఇండియన్ టెకీలకు ఎలాన్ మస్క్ శుభవార్త
ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఇండియన్ టెకీలకు తీపికబురు అందించారు. ట్విటర్ కొత్త నియామాకాల్లో ఎక్కువగా భారతదేశ ఇంజనీర్లను నియమించాలని మస్క్ యోచిస్తున్నారట. ట్విటర్ ఇంటర్నెట్ సమావేశంలో, ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీ స్టాక్‌ను మొదటి నుండి నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మస్క్ ఇంఇయిన్ ఇంజనీర్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ట్విటర్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముగింపు పలికన మస్క్ ఇపుడికి మరింత మందిని నియమించుకోవాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువ మందిని నియమించుకునే తన ప్రణాళికలను వెల్లడిరచారు






